- తమకు మేలు చేసే కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో బేగంపేట డివిజన్ కు చెందిన 28 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను ఎమ్మెల్యేvశ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆడపడుచు పెండ్లి ఆర్ధికంగా ఎంతో భారమని అన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, ఆరీఫ్, అఖిల్, సి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.