ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ.కొత్తకోట శ్రీనివాస రెడ్డి మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు బుధవారం జియో ఇన్ఫోకామ్ , సోమాజిగూడ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. సిగ్నల్ జంపింగ్ అతి ప్రమాదకరం, ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపాలి. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. అదే విదంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. రోడ్డు మీద ఆదమరచి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం. వాహనాలకు భీమా తప్పనిసరిగా చేయించాలి. ఈ కార్యక్రమంలో హీరో మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జియో ఇన్ఫోకామ్, సోమాజిగూడ ఉద్యోగులకు ఉచితంగా హెల్మెట్స్ పంపిణి చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమములో 150 మంది ఉద్యోగులు మరియు TTI బేగంపేట సిబ్బంది పాల్గొన్నారు.





