తాళ్లూరు ఎబీసీ హైస్కూల్ కి చెందిన ఇరువురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల సాధించినట్లు ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు తెలిపారు. 2024 ఎస్ఎస్.సి పదవతరగతి పరీక్షా ఫలితాలలో
తాళ్లూరు మండల మొదటి స్థానం సాధించిన విద్యార్థి కె. ఆనిష్ రెడ్డి (588) , బి సూర్యప్రకాశ్ (583) లు సీట్లు సాధించారు. ఆర్ జెయూకెటీ ఇడుపుల పాయలో కౌల్సిలింగ్ కు హాజరు కాగా, శ్రీకాకుళం ఆర్ జెయూ కేటీలో సీట్లు కేటాయించారు. సూర్యప్రకాశ్ తండ్రి జయపాల్ రావు రెవిన్యూ శాఖలో లైసెన్సు సర్వేయర్ గా పనిచేస్తున్నారు. విద్యార్థులు చిన నాటి నుండి ఎబీసీ హైస్కూల్లో విద్యను అభ్యసించి ఉత్తమ మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు తెలిపారు. విద్యార్థులు ట్రిబుల్ ఐటీ సీట్లు సాధించటంపై కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె కాలేషా బాబులు హర్షం వ్యక్తం చేసారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


