ఒంగోలు శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ వరదబాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10లక్షల విరాళం అందించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కలిసి ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన రూ. 10 లక్షల చెక్కును అందించారు. అంతేకాకుండా ముందుగా వరద బాధితుల సహాయార్థం 2000 మందికి సరిపడా భోజనం మంచినీళ్ళ బాటిల్లు ముందుగా అందించారు. ఇతోధికంగా బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
