దేశ ప్రజలను ఏకం చేసే ఎక తాటిపైకి తేచ్చే మహత్తత మాధ్యమం జాతీయ బాష హిందీ అని ఎబీసీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు అన్నారు. ఏబీసీ హైస్కూల్ లో శనివారం జాతీయ భాషా దినోత్సవం (హిందీ దివస్ )ను కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దాదాపు 3,372 పైగా భాషలను దేశ ప్రజలు మాట్లాడుతుండగా వాటిలో 24 అధికార బాషలను గుర్తించినప్పటికి జాతీయ భాషగా హిందీనే భావిస్తున్నామని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడి అర్ధం చేసుకునే వారి సంఖ్య ఎక్కువ అన్నారు. 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగంలోని 343 అధికరణం దేవ నాగరి లిపిలోని హిందీని అధికారక బాషగా గుర్తించినట్లు తెలిపాఉ. నాటి నుండి ఏటా సెప్టెంబర్ 14ను హిందీని జాతీయ బాషా దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు. హిందీ బాషపై ఆవశ్యకతనుఎ అవగాహన కల్పించి సుదీర్ఘకాలంగా హిందీ పండిట్ గా పనిచేస్తున్న చిన్నయ్య సేవలను కొనియాడారు. హిందీ పండిట్ చిన్నయ్య మాట్లాడుతూ…. హిందీ అనే పదం పర్షియన్ బాషలోని హింద్ నుంచి వచ్చిందని – హింద్ అంటే సింధూ నది ప్రవహించే నేల అని అర్థం అని చెప్పారు. హింద్ బాషను నేర్చుకున్న వారికి అందులో డిగ్రీ పట్టా పొందిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కేంద్ర సాయుధ బలగాల్లో చేరే వారికి హిందీ ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. రైల్వే ఉద్యోగాలలో సైతం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అనంతరం కెక్ ను కట్ చేసి , హిందీ పండితుడు చిన్నయ్యను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. డైరెక్టర్ కె కాలేషా బాబు, ఎన్ఏలు కొండల రావు, వెంకట రావు, స్వరూప రాణి, చిరంజీవి, విక్రమ్ రెడ్డి, సుష్మిత, వలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


