అశోక్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ నర్సింగ్ రావు కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ శుక్రవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం రాంగోపాల్ పేట లోని వారి నివాసానికి వెళ్లి అశోక్ పార్ధీవ దేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. MLA తో పాటు BRS పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు శ్రీహరి, కిషోర్, లక్ష్మీపతి తదితరులు నివాళులు అర్పించారు.
