అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో గురువారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎంపీడీఓ కెవై కీర్తి, సీడీపీఓ సీహెచ్ భారతిలు పాల్గొని అంగన్వాడీల ద్వారా గర్బిణిలకు, బాలింతలకు అందుతున్న సేవలను గురించి వివరించారు. ఎస్సై మల్లిఖార్జున రావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఎవో ప్రసాదరావు, ఎపీఓఎ దేవరాజ్, సూపర్వైజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
