అధికార యంత్రాంగం పారదర్శకంగా జవాబు దారితనంగా ఉండి అవినీతి రహితంగా ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించటం కొరకు వనరులను వృథా కాకుండా వినియోగించుట కొరకు సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయాధికారి బి ప్రసాదరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కెవై కీర్తి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005వ సంవత్సరంలో రాష్ట్ర పతి ఆమోదించారని, 2009 నుండి అమలులోనికి వచ్చిందని వివరించారు. ఐసీడీఎస్ సీడిపిఓ సీహెచ్ భారతి, వ్యవసాయాధికారి ప్రసాదరావు సమచార హక్కు చట్టంను ఉపయోగించుకోవాల్సిన విధానాన్ని వివరించారు. ఎపీఎం దేవరాజ్, కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
