బేగంపేట లో డ్రైనేజీ నీరు పొంగి రోడ్ల పైన పారుతుందటం తో వాహనదారులు,పాదచారులు,నివాస గృహాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.బేగంపేట విమానాశ్రయం ఎదుటమెట్రో పిల్లర్ సి 1334 మధ్య వున్న ప్రధాన రోడ్ పైన డ్రైనేజీ పొంగి రోడ్లపైకి వస్తుండటం తో ద్విచక్ర వాహన దారులు జారి పడిపోతున్నారు.నిత్యం ఇక్కడ డ్రైనేజీ పొంగుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోక పోవడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బేగంపేట బ్రాహ్మణ వాడి రోడ్ లో గణేష్ మండపం ముందు రైల్వే లైన్ కిందినుంచి వస్తున్న డ్రైనేజీ లైన్ పొంగి బ్రాహ్మణ వాడి రోడ్ పైన పారుతుంది.ఈ సమస్యను ఎవరు పట్టించుకోక పోవడం పై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే ప్రాంతం లో పాఠశాలలు వుండటం,బ్రాహ్మణ వాడి నుంచి పోస్ట్ ఆఫీస్ కి రావాలంటే వృద్దులు మహిళలు,చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మురుగునీటి లోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని మండి పడుతున్నారు.భాఘవంటాపూర్ బస్తీకి వెళ్ళే రోడ్ లోనూ నిత్యం ఇదే పరిస్థితి వుండి. 1-10-73సాయి సెలూన్ షాప్ మెయిన్ రోడ్ లో గడచిన నెలరోజులుగా డ్రైనేజీ పొంగుతున్నాా సంబంధిత శాఖ అధికారులకు చీమ కుట్టినట్లు గా కూడా లేక పోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత వాటర్ వర్క్స్ శాఖ ఉన్నతాధికారులు బేగంపేట లో నిత్యం పొంగి పొర్లు తున్న డ్రైనేజీ నీటిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.





