పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనే సుజాత మరణం చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్ కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు మరణించారు. కాగా శనివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో సుజాత భర్త రవి కుమార్, ఇద్దరు చిన్న కుమార్తెలకు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు ఉన్మారు.
