రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని శనివారం రాష్ట్ర కార్యాలయంలో పలు నియోజకవర్గ ఇన్చార్జులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ దర్శి, మార్కాపురం, కనిగిరి, ఇన్చార్జీలు పుట్లూరి కొండారెడ్డి, సయ్యద్ జావిద్ అన్వర్, దేవరపల్లి సుబ్బారెడ్డి లు కలిసిన వాటిలో ఉన్నారు. పార్టీ పటిష్టతపై పలు సమస్యలపై చర్చించారు.
