ప్రమాదాల నివారణకు తాళ్లూరు పోలీసులు మంగళవారం చర్యలు చేపట్టారు. తాళ్లూరు- ముండ్లమూరు రోడ్ లో ఎస్సై మల్లిఖార్జున రావు ఆధ్వర్యంలో రోడ్డు మార్జిన్లను మూసివేసిన జపాన్ తుమ్మచెట్లను తొలగించారు. వర్షాల సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ప్రొక్లయిన్ ను ఏర్పాటు చేసి జంగిల్ క్లియరెన్స్ చేసారు.

