తాళ్లూరు వైసీపీ కీలక నేత ,జడ్పీటీసీ మారం వెంకట రెడ్డి జనసేనపార్టీలోకి చేరేందుకు రంగంసిద్ధం చేసుకున్నారు. మాజీ మం త్రి బాలినేనితో పాటు ఈనెల 26 వతేదీ రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చు కోనున్నారు. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మగా వున్నారు. మారం వెంకట రెడ్డి తండ్రి మారం వెంకట సుబ్బారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ డైరెక్టర్ గా, సర్పంచ్ గా పలు కీలక పదవులు నిర్వహించాడు. జడ్పీటీసీ మారం వెం టరెడ్డి చిన్న వయస్సు నుండి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరు గా వుండి కాంగ్రెస్ లో కీలకంగావ్యవహరించారు.వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో వుండి మండల పార్టీ అధ్యక్షుడుగా రెండు పర్యాయాలు ఉండి క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యున్నతికి కృషి చేశారు. 2014, 2022 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వైసీపీ తరుపున తాళ్లూరు జడ్పిటిసిగా ఎన్నికయ్యారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరుతుండటంతో జడ్పీటీసీ మారం కూడా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది .బాలినేని కబురు పంపటంతో రెం డుపర్యాయాలు బాలినేని కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. జడ్పీటీ సీమారం వెంకటరెడ్డితో పాటు బెల్లంకొండవారిపాలెం వైసీపీ సర్పంచిపోశం సుమ లత శ్రీకాంత్ రెడ్డి జడ్పీటీసీ అనుచరులు జనసేన తీర్థం పుచ్చుకోన్నారు. మారం చేరికతో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
