శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయిన ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి మోండా మార్కెట్ లోని ఓల్డ్ జైల్ ఖానా వెనుక గల GHMC కి చెందిన పురాతన భవనం కూలిపోయి పక్కనే ఉన్న షాపులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 6 టైలర్ షాపులు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులను పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల నుండి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 20 పేద కుటుంబాలు ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయాయని ఈ సంఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. షాపులు కూలిపోవడం వలన కుట్టు మిషన్ లు ధ్వసం కావడమే కాకుండా దసరా పండుగ సందర్భంగా కుట్టేందుకు అనేకమంది ఇచ్చిన దుస్తులు కూడా ఎందుకు పనికిరాకుండా పోయాయని బాధితులు MLA ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. స్పందించిన ఆయన ఒక్కో బాధిత కుటుంబానికి తన వ్యక్తిగతంగా 20 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తానని ప్రకటించారు. షాపులు కూలిపోయినందున వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసి ఆదుకోవాలని అన్నారు. MLA వెంట టౌన్ ప్లానింగ్ ACP నర్సింగ్ రావు, BRS పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, మహేష్, మహేందర్, అమర్,




