ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ శ్రీ. వి .రాంచందర్ అన్నారు. హైదరాబాద్ కమీషనర్ సి.వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి . విశ్వ ప్రసాద్ ల ఆదేశాల మేరకు బుధవారం బేగంపేట లోని ఉద్భవ్ స్కూల్, విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామ్ చందర్ మాట్లాడుతూ మైనర్లు (18 సంవత్సరాలలోపు పిల్లలు) వాహనాలు నడపరాదని, ఆది చట్టరీత్య నేరమని అన్నారు. ఎవరైనా అలా వాహనాలు నడిపినట్లైతే తల్లిదండ్రులు, మరియు వాహన యజమానికి జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. మరియు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది అని తెలియజేసారు. విద్యార్థులకు చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి అన్నారు. అంతే కాకుండా రోడ్డుభద్రత, నియమాల గురించి వారియొక్క బోధనాంశాలలో కూడా చేర్చాలి అని అన్నారు. రహదారులపై క్రమశిక్షణగా వ్యవహారించాలి అన్నారు. విద్యార్థులు రోడ్డు దాటనప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి తెలియజేసారు. ఈ సంవత్సరం ఆగష్టు చివరి నాటికి హైదరాబాద్ లో 1736 మైనర్ కేసులు బుక్ అయినట్లు ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం 550 మంది మైనర్లకు వారి తల్లితండ్రుల సమక్షంలో టి.టి.ఐ. బేగంపేట్ లో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగ లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం మరియు రోడ్డు మీద ఆదమరచి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదకరం అన్నారు. ఈ కార్యక్రమములో సుమారు 200 మంది విద్యార్థులు, హెడ్ మిస్ట్రెస్ నసీర్ వునిశా బేగం, వర్ష సింగ్, వారి సిబ్బంది మరియు మహమ్మద్ అయాన్, కృష్ణ టిటిఐ బేగంపేట పాల్గొన్నారు.
