ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహించటం అభినందనీయమని దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అందులో బాగంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు స్టార్లు ఏర్పాటు చేసారు. స్టాల్ ను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చంనాయుడు ఆధ్వర్యంలో పలు ఆధునిక పరికరాలు సబ్సిడీపై ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై యంత్రాలు ఇవ్వకుండా, డ్రిప్ సక్రమంగా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసారని గుర్తు చేసారు. ప్రకృతి కరుణించి మంచి వర్షాలు పడ్డాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంలో మంచి ధరలు గిట్టుబాటు ధరలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎరువులు, పురుగు మందులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ధాన్యం బకాయిలు చెల్లించినట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన నడుస్తున్నట్లు కితాబు ఇచ్చారు. ముందుగా పొలం పిలుస్తుంది వాల్ పోస్టర్ను విడదల చేసారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, సీనియర్ నాయకుడు ఐ రమణారెడ్డి, మానం రమేష్ బాబు, షేక్ పెదకాలే షావలి, ఎస్. కొండారెడ్డి, ఐడమ కంటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయాధికారి ప్రసాదరావు, పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఎఈఓలు, విఏఏలు పాల్గొన్నారు.

