ఈనెల 28న జరగనున్న
మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయడంలో భాగంగా జిల్లా న్యాయమూర్తి డి రాజేష్ బాబు బుధవారం కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో లోక్ అదాలత్ లను విజయవంతం చేయడంలో జిల్లా ముఖ్యస్థానం వహించిందని అందులో కల్వకుర్తి కోర్టు నుండి ఎక్కువ కేసులు పరిష్కరించ డం లో జడ్జీలు, న్యాయవాదులు పోలీసుల పాత్రను న్యాయమూర్తి అభినందించారు.
అదేవిధంగా ఈ నెల 28న జరగబోయే మెగా లోక్ అదాలత్ ద్వారా కూడా ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. జూనియర్ సివిల్ జూనియర్ సీనియర్ కోర్టులలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ ,ఎం సి, డి వి సి ,హెచ్ ఎం ఓ పి వంటి కేసులలో ఎక్కువ పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.
రాజీ పడడం వలన డబ్బు సమయం ఆదా కావడ మీ కాకుండా కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు జిల్లాలో 6 మెగా లోక్ అదాలత్ జరిగాయని, అందులో ఒకటవ లోక్ అదాలతో2000 రెండవ లోక్ అదాలతో3000 మూడవ లోకదా 6000 నాలుగవ లో కాదు13000 ఐదవ లోక్ అదాలత్ లో 15000 కేసులు పరిష్క రించి రాష్ట్రంలో ప్రథమ స్థానం నిలిచామని అలాగే ఆరవ మెగా లోక్ అదాలత్ 18 వేల కేసులు పరిష్కరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు . అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు స్వచ్ఛభారత్ లో భాగంగా కోర్టు ఆవరణ శుభ్రపరిచారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి వెంట సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి జూనియర్ సివిల్ జడ్జి కావ్య ఉన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ,, న్యాయవాదులు వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్ రాజ్ లక్ష్మీనారాయణ శ్రీ కృష్ణయ్య, ఎస్ మల్లేష్ రామ్ గోపాల్ బి మల్లేష్ జయంత్ శ్రీకాంత్ జంగయ్య శ్రీను ప్రశాంత్ సాయిబాబు వీరితోపాటు సీనియర్ కోర్టు సూపర్డెంట్ ఆనంద్ సిబ్బంది జూనియర్ కోర్ట్ సూపర్డెంట్ సత్యం కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



