సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ పరిధి లోని ఎన్ బి టి నగర్ పాటిగడ్డ బస్తీ ఎన్నికలలో అవక తవకలు జరిగాయని,విచారణ జరపాలని ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన చిరంజీవి బేగంపేట ఏ .సి.పీ.గోపాల కృష్ణ మూర్తి నీ కల్సి పిర్యాదు చేసారు.ఎన్నికలకు ఉపయోగించిన ఓటరు జాబితాను తనకు ఇవ్వాలని అడిగినప్పటికీ ఎన్నికలు నిర్వహించిన వారు పట్టించుకోవడం లేదన్నారు.ఎన్నికల్లో అప్పర్ ఎన్ బి టి నగర్ బస్తీ వాసులను తొలగించారని,ఫిర్యాదులో తెలిపారు.బస్తీ ఎన్నికలలో జరిగిన తీరుపైన అనేక అనుమానాలు తనకి వున్నాయని, ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపాలని,ఓటర్ జాబితాను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని బాధితుడు చిరంజీవి ఏ సి పి నీ అభ్యర్థించారు.
