పీ.ఎం.శ్రీ పథకంలో పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం విద్యాశాఖ పై తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల విద్యాధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీ.ఎం.శ్రీ పథకంలో ఇప్పటి వరకూ వచ్చిన నిధుల వివరాలను అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ మొదటి దశలో చేపట్టిన పనులను అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. నాణ్యత విషయంలోనూ నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలని, ఆయా విషయాలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ-2 లు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా రెగ్యులరుగా పరిశీలిస్తూ ఉండాలని ఆమె చెప్పారు. ఈ విషయాలలో నిర్లక్ష్యం వహిస్తే ఎంఈఓ-2 లపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
సమావేశంలో డిఇఓ సుభద్ర, డిప్యూటీ డిఇఓ సామా సుబ్బారావు, సమగ్ర శిక్ష డీ.ఈ. నమ్మయ్య, ఏ.పి.ఓ.మాధవీలత, డీ.సీ.డీ.వో. ప్రమోద, ఏ.ఎం.వో. రమేష్, ఎం.ఐ.ఎస్. కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎం.శ్రీ పథకంలో పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
26
Sep