ఈటివి సీనియర్ జర్నలిస్టు టి.నారాయణ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ల సంతాప సభ ఏపీయుడబ్లూజే ఆధ్వర్యంలో శనివారం మార్కాపురం ప్రెస్ క్లబ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ ….పాత్రికేయ వృత్తిలో ఎంతో పేరు తెచ్చుకున్న నారాయణ పిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని అన్నారు. నారాయణ కుటుంబానికి తమ యూనియన్ సహకారం ఎప్పుడు వుంటుందని అన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు సిపిఎం లోనే కొనసాగుతూ పేదలకు అండగా వున్న జాతీయ నేత సీతారాం ఏచూరి మరణం దేశానికే గాక అంతర్జాతీయ వామపక్ష ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.
ముందుగా సీతారాం ఏచూరి, నారాయణ ల చిత్ర పటానికి ఐవి సుబ్బారావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకుకు,వార్త బ్రాంచి మేనేజర్ మూల అల్లూరి రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి. మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

