తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, సోమవరప్పాడు గ్రామాలలో జిల్లా వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం, దర్శి కెవికే కోఆర్డినేటర్ రమేష్, వ్యవసాయాధికారులు పలు పంటలను, ఎరువుల దుకాణాలను పరిశీలించారు. వరి, మొక్కజొన్నలలో ఆశించిన తెగుళ్ల నివారణకు తగిన సూచనలు చేసారు. దర్శి ఎడీఏ బాలాజీ నాయక్ విత్తన దుకాణాలను తనిఖీ చేసారు. ఎడీఏ రమేష్, డిఆర్సీ ఎవో శేషమ్మ, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఎఈఓ నాగరాజు, విఏఏలు సుమ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

