తాళ్లూరు మండలంలో గ్రామ పొదుపు సంఘాల్లో దీర్ఘకాలంగా కొనసాగు తున్న గ్రామ సంఘాలను మార్చి కొత్తసంఘాలను ఏర్పాటుచేస్తున్నట్లు వెలుగు ఏపీఎం దేవరాజ్ తెలిపారు. శనివారం తాళ్లూరులోని వెలుగు కార్యాలయంలో జరిగిన గ్రామసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొన్ని గ్రామ సంఘాల కమిటీలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నందున, వాటిని మార్పు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో మహిళా గ్రూపులు అంతా కలిసి మార్పు చేసుకుంటున్నారని తెలిపారు. సమావేశంలో సీసీలు సుచింద్ర, మోహన్ రావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సుభాషిణి, కోశాధికారి లక్కం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
