దుర్గా మాత మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి……..మహంకాళీ ఏ సి.పీ సర్దార్ సింగ్………….

మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే దుర్గామాత మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలను పాటించాలని మహంకాళీ ఏ సి.పీ సర్దార్ సింగ్ అన్నారు.సోమవారం మహంకాళీ పోలీస్ స్టేషన్ ఆవరణలో దుర్గామాత మండపాల నిర్వాహకులకు,డి.జే సౌండ్ యజమానులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మహంకాళీ ఇన్స్పెక్టర్ పరుశురాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఏ సి పి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ సి పి సర్దార్ సింగ్ మాట్లాడుతూ దుర్గా మాతా మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు .చేపట్టాల్సిన జాగ్రత్తలు,చేయకూడని పనులపై అవగాహన కల్పించారు.డి జే లకు అనుమతి లేదన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కేసులు నమోదు చేస్తామని ఏ సి పి హెచ్చరించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *