సికింద్రాబాద్ లో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ, కబ్జాలకు పాల్పడుతున్న వారి పైన ఉక్కు పాదం మోపాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు.
సోమవారం జిహెచ్ఎంసి లో నిర్వహించిన ప్రజావాణిలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ నీ కల్సి ఆయనకు వినతి పత్రం అంద జేశారు.
ఈ సందర్భంగా కాం పల్లి మాట్లాడుతూ..
నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను, కబ్జాలను కట్టడి చేసి అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యంగా దూద్ బాయ్ ప్రభుత్వ పాఠశాల దారికి అడ్డంగా ప్రహరి గోడ నిర్మించి నిర్మించుకున్న షెడ్డును తొలగించి విద్యార్థులకు రహదారి ఏర్పాటుకు కృషి చేయాలని జోనల్ కమిషనర్ ను కోరారు.
సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ అక్రమాలను ఉపేక్షించబోమని తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారనీ కాం పల్లి శ్రీనివాస్ తెలియజేశారు.
