ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ. సి.వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మంగళవారం జె .బి.ఎస్ లోని ఆర్.టి.సి. డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్.టి.సి. బస్సులో ప్రయాణం అంటేనే సురక్షిత ప్రయాణం అని అన్నారు. ఒక బస్సు లో సుమారు 40 నుండి 50 మంది ప్రయాణికుల ప్రాణాలు ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయి, కాబట్టి డ్రైవర్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా బస్సును నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి అన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎప్పుడు కూడా పనికిరాదు. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరు వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. అందరు తప్పని సరిగా జీవిత భీమా చేసుకోవాలి. ముఖ్యంగా ఆందోళనకు గురికావద్దు, ఆకస్మాత్తుగా సంభవించే మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవన శైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవటం, శారీరక వ్యాయ్యామంపై ఆశ్రద్ధ వహించటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని తెలియజేసినారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదు అన్నారు. సిగ్నల్ జంప్, రాష్ డ్రైవింగ్ లు చేయరాదు అన్నారు. ఇట్టి కార్యక్రమములో సుమారు 70 మంది డ్రైవర్స్, డిప్యూటీ ఆర్.ఎం.ఓ. శ్రీ. భీంరెడ్డి, శ్రీ.భాస్కర్ రెడ్డి, పి.ఓ., శ్రీ. శ్రీనివాస్ ఉప్పల్ డి.ఎం. మరియు ఇతర సిబ్బంది, వెంకట ప్రసాద్ హెచ్. జి. అధికారి టిటిఐ బేగంపేట పాల్గొన్నారు.




