సైన్సైపై అవగాహన పెంచి విద్యార్థులలో శాస్త్రీయ దృక్పదం పెంపొందించటానికి జనవిజ్ఞాన వేదిక ఎంతో కృషి చేస్తుందని తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ కుమారి అన్నారు. స్థానిక పాఠశాలలో మంగళవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకు ముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని ఆరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు, నాలుగు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన విద్యార్థులు టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలలో లక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు టి. శిరీష, షేక్ నాయబ్ రసూల్, బి శివ క్రిష్ణ బృందం ప్రధమ స్థానం సాధించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గీతాంజలి హైస్కూల్ చెందిన బృందం కండే మధు శివ ప్రసాద్, తూము ఇందిరా, షేక్ అబ్దుల్ రహమాన్ లు ప్రథమ స్థానంలో నిలచారు. విజేతలైన ఈ రెండు బృందాల సభ్యులు 27న జిల్లా స్థాయిలో జరుగు చెకుముకి టాలెంట్ టెస్ట్లో పాల్గొంటారని జెవివి కన్వినర్ ఆర్ నాగ సురేష్ తెలిపారు. జిల్లాలో విజేతలైన వారు రాష్ట్ర స్థాయిలో జరుగు పోటీలలో పాల్గొననునట్లు చెప్పారు. విజేతలైన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్ యాతం శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
