ఈ పంట నమోదులో పారదర్శకత కోసమే సూపర్ చెక్ చేస్తున్నట్లు తహసీల్దార్ నాగలక్ష్మి తెలిపారు. తాళ్లూరు-1, 2, విఠలాపురం లలో సోమవారం పలు క్షేత్రాలను వేరు వేరుగా తనిఖీ నిర్వహించారు. ఖరీఫ్ మండలంలో 7870 ఎకరాలలో 53 రకాల పంటలను ఈ- పంట లో నమోదు చేసినట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. పంటల నమోదు వివరాలు సూపర్ చెక్ తర్వాత జాబితా సిద్ధం చేయటం జరుగుతుందని వ్యవసాయాధికారి తెలిపారు. విఆర్ ఎం నాగలక్ష్మి, విఏఏ లు నాగ రాజు నాయక్, వెంకట రావు, అశోక్ లు పాల్గొన్నారు.
