ఎస్సీ ఆవాస ప్రాంతాలలో మౌళిక వసతులపై సమగ్రమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా సూచించారు. పీజీఎస్ ఆర్ భవనంలో సోమవారంమ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ నివాస ప్రాంతాలలో ప్రధాన రహదారులను కలిపే సీసీ రోడ్స్, డ్రైన్స్, సురక్షిత తాగు నీరు, వంటి అంశాలపై ప్రత్యేక శ్రర్థ వహించి గుర్తించాలని తెలిపారు. షేడ్యూల్ కులాల కాంపోనెంట్ (ఎస్సీపీ ) చట్టం సమాజంలోని ఇతర వర్గాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీల మధ్య అభివృద్ధి సూచికలలోని వ్యత్యాసాలను పూరించటానికి ఉద్దేశించబడినదని అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సంబంధిత మండల కార్యాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించి వారి నుండి సేకరించిన డేటాను ఎస్సీఎస్పీ పోర్టల్లో అప్లోడ్ చేయటం వలన మౌళిక సదుపాయాల కల్పనలో వ్యత్యాసం తగ్గుతుందని అన్నారు. ఈ నివేదికలను ఈనెల 14లోపు ఆప్ లోడ్ చెయ్యాలని ఆదేశించారు. సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ లు పాల్గొన్నారు.
