00 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా , అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులతో సమావేశమై వందరోజుల ప్రణాళికల లక్ష్యాల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తీ చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని సాధించేందుకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పురోగతి జీరోగా ఉండకూడదని, వంద శాతం లక్షాన్ని సాధించేలా సంబంధింత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పధకం కింద 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చూపిన పనులపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ డ్వామా పిడి ని ఆదేశించారు. అలాగే హౌసింగ్ శాఖ అధికారులు గృహ నిర్మాణాల పురోగతిపై దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వేంకటేశ్వర రావు, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, మత్స్య శాఖ జేడి చంద్రశేఖర్, పశు సంవర్థక శాఖ జేడి డా. బేబి రాణి, డిఆర్డిఏ పిడి వసుంధర, మెప్మ పిడి రవి కుమార్, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఐసిడిఎస్ పిడి మాధురి, ఎపిఎంఐపి పిడి రమణ, డిపిఓ వెంకట నాయుడు, డిటీసి సుశీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్.ఈ దేవానందం తదితరులు పాల్గొన్నారు.

