రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బుగ్గ – కైప – గిద్దలూరు సెక్షన్ NH 544D రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికను సమగ్రం గా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎన్.హెచ్.ఏ.ఐ, ఆర్ అండ్ బి, ఆర్.డబ్ల్యూఎస్., వ్యవసాయ , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బుగ్గ – కైప – గిద్దలూరు సెక్షన్ NH 544D రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఈ ప్రాజెక్ కు సంబంధించి ప్రకాశం జిల్లా పరిధిలో 24.028 కి.మీ వుందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బుగ్గ – కైప – గిద్దలూరు సెక్షన్ NH 544D రోడ్డు విస్తరణ పనుల ప్రాజెక్ట్ కు సంబంధించి సంబంధిత అధికారులు జాయింట్ పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత నేషనల్ హైవే అధారిటి ఆఫ్ ఇండియా పిడి పద్మ, ఆర్ అండ్ బి ఎస్ఈ దేవానందం, వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాస రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


