దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం బేగంపేట ప్రకాశం నగర్ లోని శ్రీ భూ లక్ష్మి దేవి దేవాలయం లో అమ్మవారు శ్రీ మహా సరస్వతీ దేవి అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత విశాల్ సుధామ , ఈ ఓ విఠలయ్య ల ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.ఆలయాన్ని వివిధ రకాలైన పూలతో అందంగా అలంకరించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
