శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం అంకమ్మ పాలెం లో వెలసియున్న శ్రీ కాళికా పరమేశ్వరి దేవస్థానంలో ఉదయం 11 గంటలకు పదిమంది వేద పురోహితులు సుహాసినిల చేత సామూహిక గా కాళికా పరమేశ్వరి దేవి లక్ష కుంకుమార్చన పూజాక్రతువులను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను సేకరించి అర్చక స్వామి రాము శర్మ చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు.


