దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయం లో శ్రీ దుర్గా దేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.గురువారం ఆలయం లో చండిహోమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత విశాల్ సుధామ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.హోమంలో పాల్గొన్న భక్తులతో పాటు ప్రతి ఒక్కరికీ అన్న సంతర్పణ చేశారు.విశాల్ సుధామ నేతృత్వం లో అర్చకులు మఠం సదాశివుడు ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయం లో జంట నగరాల పరిధిలోని ఏ ఆలయం లో జరగని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ,కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసారు.ప్రతిభ కనబరిచిన కళా కారులకు ఆలయ నిర్మాణ దాత విశాల్ సుధామ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానం చేశారు.భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.


