బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో సద్దుల బతుకమ్మ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.అనంతరం వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చారు.తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ సందర్భంగా కోట నీలిమ ను ఘనంగా సత్కరించారు.అనంతరం డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే వివిధరకాల పూలను పూజించే అరుదైన పండుగ అని,ఇది
తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయాలను తెలియజేస్తుందన్నారు.అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలందరికీ అందించాలని డాక్టర్ నీలిమ కోరుకున్నారు.ఈ వేడుక కు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.తెలంగాణ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం మరియు జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతూ, సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ ప్రజలను ఏకం చేస్తుందన్నారు. విలువలు , సంప్రదాయాలను పునరుద్ఘాటించడం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీర్‌పేట డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజ్, రవి, రజనీకాంత్, గోవింద్ రాజ్, శంకర్ గౌడ్, అమృత, పద్మావతి, ఆండాళు, సుకన్య, శ్రీవేణి, శారద, దేవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
