ప్రకాశం జిల్లా యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక దర్శి నగర పంచాయతీ అద్దంకి రోడ్డు రాఘవ ఫంక్షన్ హాల్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తూము వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం ప్రకాశంజిల్లా గౌరవ అధ్యక్షులు కోటంశెట్టి హనుమంతరావు,జిల్లా అధ్యక్షులుగా కేవీ సుబ్బారావు,ప్రధాన కార్యదర్శిగా ఎ. రంగస్వామి రెడ్డి, కోశాధికారిగా సోము చౌడారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గా చొప్పరపు నాగేశ్వర రావు,జాయింట్ సెక్రటరీ గా కొలా సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి.ప్రసన్న కుమార్,ఉప కోశాధికారిగా టి. శ్యామ్ కుమార్,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గా వేమా శివకుమార్, జీ. సురేష్, జే.వెంకట్రావు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో కోర్ కమిటీ సభ్యులు జూపల్లి కోటేశ్వర రావు,పుప్పాల పాపారావు తదితరులు పాల్గొన్నారు.
