దర్శి నియోజక వర్గంలో 23 మద్యం దుకాణాలకు 376 దరఖాస్తులు వచ్చినట్లు దర్శి ఎక్సైజ్ సీఐ కె శ్రీనివాస రావు తెలిపారు. దర్శి మండలంలో 9 దుకాణాలకు గాను 144 దరఖాస్తులు, దొనకొండ మూడు దుకాణాలకు గాను 50 దరఖాస్తులు, కురిచేడు మూడు దుకాణాలకు గాను 55 దరఖాస్తులు, ముండ్లమూరు నాలుగు దుకాణాలకు గాను 68 దరఖాస్తులు, తాళ్లూరు నాలుగు దుకాణాలకు 59 దరఖాస్తులు అందినట్లు వివరించారు. దరఖాస్తుల పరిశీలన, లాటరీకి ఏర్పాట్లు 12, 13ల తేదీలలో, లాటరీ 14న జరుగునని చెప్పారు. ఈనెల 16న నూతన మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో కేటాయింపు జరుగునని , కేటాయింపు జరిగిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణపు నిర్దేశిత ధరలు 1/6 వంతు లేదా పూర్తి మొత్తము ప్రభుత్వానికి జమ చేయుటకు సిద్ధంగా రావాలని , వివరించారు.
