దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వంగా అంబుజ,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ లు ఎంపీ దంపతులకు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు.వారిని పూల మాలలు.శాలువా తో ఘనంగా సత్కరించారు.పూజలు నిర్వహింప చేశారు.అనంతరం తీర్థ ,ప్రసాదాలు అందజేశారు.ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.

