దీర్ఘ కాలంగా తాళ్లూరు ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న తూర్పుగంగవరం-తాళ్లూరు ఆర్అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొట్టిపాటిలక్ష్మి చొరవ తీసుకుని ఆర్ అండ్ బి అధికారులో మాట్లాడి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగంగవరం- తాళ్లూరు ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి శిద్దా రూ.6 కోట్ల నిధులకు కృషి చేశారు. 2019 ఎన్నికలకోడ్ రావటంతో ఆనిధులు విడుదల కాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేశారు. మద్దిశెట్టి కృషి మేరకు గత ఏడాది జూలై మాసంలో రూ. 4.80కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందు టెండర్ వేయగా స్నేహా కన్షక్షన్’ టెండర్ దక్కించుకున్నారు. గతవైసీపీ ప్రభు త్వంలో పనులు చేపట్టినా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంజరుగుతుండటం, తమమాట ప్రకారం పనులు చేయక పోతే బిల్లులు నిలిపి వేస్తారన్న భయంతో కంటాక్టర్ దాదాపు ఏడాదిన్నర కాలంగా పనులు చేయక మిన్నకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. తూర్పు గంగవరం- తాళ్లూరు ఆర్అండ్ బి రోడ్డు (సింగిల్ రోడ్) నిర్మాణానికి నిధులు వున్నా యని, పనులకుటెండర్ కూడా పూర్తయిందన్న విషయం తెలుసుకున్న దర్శి నియోజక వర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గోట్టిపాటి లక్ష్మి ఆర్అండ్ బి అధికారులతో, కాంట్రాక్టర్ తో చర్చించారు. ప్రజలు ఈమార్గం గుండా ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే రోడ్డునిర్మాణ పనులు చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో ఆర్అండ్ బి అధికారులు అప్రమత్తమై పనులు ప్రారంభించారు. తూర్పుగంగవరం- తాళ్లూరు నడుమ గుంటల మయమైన రోడ్డును ప్రొక్లెయిన్తో లేయర్ ను తొలగించారు. గత 7 ఏళ్లుగా పెండింగ్లో నున్న ఆర్అండ్ బి రోడ్డుకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించ ఉండడంతో ప్రయాణికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
