బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కారణంగా ఎప్పటికప్పుడు పరిస్థితి ని తెలుసుకోవడం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూము తో పాటు మీడియా వాచింగ్ రూము ను ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం జిల్లా కలెక్టర్ శ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి మీడియా వాచింగ్ రూము ను పరిశీలించారు .
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాకు సంబంధించి మీడియా లో వస్తున్న తుఫాన్ సంబంధిత అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సంబంధిత న్యూస్ ను పై అధికారులకు తెలియచేయాలని జిల్లా కలెక్టర్, సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఎస్డిసి సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.
