తాళ్లూరు ఎంపీడీవోగా కల్లూరి సుందరరా మయ్య (ఎఫ్.ఏ.సీ) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేయుచున్న ఎంపీడీవో కెవై యుగకీర్తిని గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. ఈ సందర్బంగాఎంపీడీవో సుందర రామయ్య మాట్లాడుతూ… గ్రామాల్లో అభివృద్ధి జరగటంతో పాటు, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో వుండి సత్వరసేవలు అందించాలన్నారు. పారిశుద్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.
బాధ్యతలుచేపట్టిన ఎంపీడీవో సుందరరామయ్యను కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము సత్యం, పంచాయతీ కార్యదర్శులు ఐ.వి.రమణారెడ్డి, చిరంజీవి, రేణుక, కోటేశ్వర రావు, పలువురు కార్యదర్శులు, సినియర్అసిస్టెంట్ మల్లిఖార్జునరావులు దుశ్శాలువా తో సత్కరించి అభినందనలు తెలిపారు.

