పల్లెల్లో మౌళిక వసతులు కల్పన ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీవో కల్లూరి సుంద రరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ- ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా మండలంలోని బొద్దికూరపాడు, వెలుగు వారిపాలెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీజాతీయ ఉపాధిహామీ పథకం కింద మండలంలోని 16 పంచాయతీలందు 58 పనులకు 3కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఆ పనులు పంచాయతీరాజ్ పర్యవేక్షణలో జరుగుతాయ న్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ… గత వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టిన పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకిరాగానే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీక కాలువలులకు అధిక ప్రాధాన్యత నిచ్చిందన్నారు. దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయించారన్నారు. పల్లె ప్రజలకు ఉపాధి కల్పించే ఉపాధి పనులుకల్పిస్తూ ప్రభుత్వం ప్రజా పక్షంగా నిలుస్తున్నదన్నారు. అభివృద్ధి జరగాలంటే సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజలు చేశారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ లు మందాశ్యాంసన్, ఎం కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ బాలకోట య్య,ఈసీ ప్రసాద్, టీడీపీ నాయకులు శాగంకొండారెడ్డి,మానం రమేష్ బాబు,మేడగం వెంకటేశ్వరరెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మయ్య, గోవింద రెడ్డి, వీ రనాగిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది, తదతరులు పాల్గొన్నారు.
