స్వర్ణ ఆంధ్ర విజన్- 2047 ప్రణాళిక రూపకల్పన పై సోమవారం అమరావతి సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కార్యదర్శులతో కలిసి.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.
వీసీ ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి జిల్లాలోని కీలక రంగాలపైన దృష్టి సారించి జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలన్నారు.
విజన్ ఆంధ్ర 2047లో భాగంగా జిల్లా విజన్ ప్రణాళికపై డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను ఈ నెల 20 వ తేదీ లోపు నివేదించాలని ఆదేశించారు. జిల్లా విజన్ ప్రణాళికలో నైపుణ్యాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్, అగ్రికల్చర్, సర్వీస్ సెక్టార్ వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి డాక్యుమెంట్ నివేదించాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధించడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయం పెరిగేలా డాక్యుమెంట్ రూపకల్పన ఉండాలన్నారు.
ఈ వర్చువల్ సమావేశంలో ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వేంకటేశ్వర రావు, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

