తాళ్లూరు, అద్దంకి, బల్లికురవ మండలాల విద్యాశాఖాధి కారిగా పని చేసి పదవీ విరమణ పొందిన యలగాల సత్యనారాయణ సోమవారం మృతి చెందారు. ఆయన మరణం పట్ల తాళ్లూరు మండల ఏపీపీఎఫ్ శాఖ గౌరవాధ్యక్షులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి, అధ్యక్షులు జి. నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, పలు వురు ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.
