తాళ్లూరు మండలంలో సోమవారం ఎడతెరపి లేని వర్షంకురిసింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు 32.4 మి.మీల వర్షపాతం నమోదు అయినది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే తూర్పుగంగవరంలో కొందరు ప్రవేట్ పాఠశాలలు తెరచారన్న వార్తతో ఎంఈఓ జి సుబ్బయ్య వారికి హెచ్చరికలు జారీ చేసారు. ఎడతెరపి లేని వర్షంతో సాధారణ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసారు. వర్షంలోను సైతం పల్లె పండుగ కార్యక్రమం రెండు గ్రామాలలో నిర్వహించారు.

