వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. శివరామ పురం, మాధవరం గ్రామాలలో వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ధృవీకరించిన సంస్థల నుండి ఆరోగ్య కరమైన, తెగుళ్లను తట్టుకునే విత్తనాలను ఎంపిక చేసుకుని వేసుకోవాలని, సాంధ్రతకు తగ్గట్టుగా మొక్కలు నాటు కోవాలని కోరారు. విఏఏ లు ఎం ఆంజనేయులు, రాజశేఖర్ రెడ్డి, సుధీర్, అనూషలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


