పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని మండల టిటిపి అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి అన్నారు. మండలంలోని బెల్లంకొండ వారి పాలెం, దోసకాయల పాడు, లక్కవరం గ్రామాలలో మంగళవారం పల్లె పండుగ – ప్రగతి అండగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
తాళ్ళూరు మండల టీడీపీఅధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను ఖాలీ చేసినా ప్రభుత్వం చేపట్టిన అనతి కాలంలోనే రాష్ట్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్ఆర్ఆజిఎస్ కింద నిధులు సమకూర్చి నాలుగు నెలల్లోనే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి 58 పనులకు గాను సైడుకాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి 3కోట్ల రూపాయల నిధులు సమకూర్చారన్నారు. ఎంపీడీవో కల్లూరి సుందరరామయ్య మాట్లాడుతూ …గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
పథకం కింద పనులు చేపడుతున్నదన్నారు. పనులు కల్పించటం వల్ల కూలీలకు ఉ పాధికూడా దొరుకు తుందన్నారు. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయటం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమాల్లో ఏపీవోమురళి , ఈసీప్రసా ద్, టీడీపీనాయకులు శాగంకొండారెడ్డి, మానం రమేష్ బాబు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, హనుమారెడ్డి, పేరిరెడ్డి, రాచకొండ వెంకట్రావు, పుట్టా నరసింహారావు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు అజయ్ కీర్తి, రేణుక, శ్రీవల్లి సచివా లయ సిబ్బంది, ఎస్ఏలు, తదతరులు పాల్గొన్నారు.
