అల్పపీడ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం మోకాలు లోతు నీరు నిలబడి జలాశయం వలె దర్శనం ఇస్తున్నాయి. ప్రకాశం జిల్లా _తాళ్ళూరు మండలం_- బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లో పడమర వైపు ఓల్డ్ రూమ్స్ వైపు స్టేజ్ ముందు గ్రౌండ్ గత 3రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు అధిక మోతాదు లో నీరు నిలబడి పెద్ద జలాశయము వలే తయారైనది. కొద్దిపాటి వర్షాలు వచ్చినా ఇలా నీరు నిలబడుతుండడంతో పిల్లలు , ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది స్కూల్ లోకి వెళ్ళుటకు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పడమర వైపు సిమెంటు రోడ్ ఎత్తు గా వేయడంతో మీరు బయటకు వెళ్లే అవకాశం లేక ఎక్కడికక్కడే …… నిలబడిపోతుంది. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలకు రెడ్ గ్రావెల్ మట్టి తోలించి నీరు నిలబడకుండా బయటకు పోవుటకు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రావెల్ తోలకువంతో పాటు సదరు నీరు పోవుటకు పడమర వైపు ప్రహరీ ప్రక్కన సిమెంటు కాలవ సచివాలయం వరకు ఏర్పాటు చేయ విన్నవిస్తున్నారు. ప్రధాన గేటు వద్ద సైతం మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడి ఉన్న పరిస్థితి ఉన్నది .ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులు మరియు స్టాఫ్ కనీసం వారం రోజులు స్కూల్ లోపలికి వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. చిన్నారులు సైతం సాహసం చేస్తే జారిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది సైతం పాఠశాలకు వెళ్లాలంటే ఫీట్ లు చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలకు అవసరమైన గ్రౌండ్ లెవెల్ మట్టిని తోలించి విద్యార్థులకు సౌకర్యవంతంగా తయారు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



