అల్పపీడనం ప్రభావంతో మండలంలో బుధవారం 85.5 మి.మీల వర్షపాతం నమోదు అయినది. ఉదయం నుంచి వర్షం కురిసి మధ్యాహ్న సమయంలో, సాయంత్రం కొంత మేర తెరప ఇవ్వటంతో ప్రజలు, రైతులు తమ పనులలో నిమగ్నమైనారు.
మండలంలో ప్రధాన వాగులు దోర్నపు వాగు, చిలకలేరులో పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారి తాళ్లూరు, ముండ్లమూరు ఆర్ అండ్ బి రోడ్ లో దోర్నపు వాగు పొంగటంతో పాటు దర్శి – తూర్పు గంగవరం రహదారిలో పలు వాగులు ఉండడంతో రెవిన్యూ, పోలీస్ ,సచివాలయ సిబ్బంది వాగుల వద్ద బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ నాగలక్ష్మి, తన సిబ్బందితో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎస్సై మల్లిఖార్జున రావు వాగుకు ఇరు వైపుల మొకులు కట్టి ప్రవాహం ఎక్కువైన సమయంలో రాక పోకలను నిషేధించారు.

