జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు 2692.5 ఎకరాలలో సజ్జ, మినుము , అలచంద పంటలు దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనాలు అందినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో 61 గ్రామాల్లో 98 మంది రైతులకు చెందిన సజ్జ 775 ఎకరాలు, మినుము 1617.5 ఎకరాలు, అలచంద 300 ఎకరాలు ఉన్నట్లు ప్రాధమిక అంచనాకు అందినట్లు వివరించారు.
