నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చెరువుకు గండి పడి చదలవాడ గ్రామం వద్ద ముంపుకు గురైన ఒంగోలు – చీరాల జాతీయ రహదారిని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం సాయంత్రం మరో సారి పరిశీలించారు. గండిపడిన చెరువు నుండి నీటిని మరలించేందుకు చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అప్రమత్తంగా వుంటూ రహదారిపై నీటి ఉదృతి పూర్తిగా తగ్గేవరకు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, ప్రాజెక్ట్స్ ఎస్.ఈ అబుత్ అలీం తదితరులు వున్నారు.



